తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..గురుకుల్లాలో 12,000 పోస్టులు.. ఈ నెలలోనే నోటిఫికేషన్లు!

-

తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పనుంది కేసీఆర్‌ సర్కార్‌. గురుకులాల్లో 12 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు సిద్ధమవుతోంది. డిసెంబర్ మూడో వారంలోగా నోటిఫికేషన్లు విడుదల కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

- Advertisement -

గురుకులాల్లో 9036 పోస్టులకు గతంలోనే అనుమతులు రాగా, మరో 3 వేల ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం రావాల్సి ఉంది. ఒకేసారి 12,000 పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాలని భావిస్తున్నారు. వీటిలో TGT, PGT పోస్టులే ఎక్కువగా ఉన్నాయి.

అలాగే, ఈ నెలలో గ్రూప్ టూ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసే ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతుంది. దాదాపు 729 గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...