దారుణం : పంట పొలంలో మైనర్‌ బాలికపై లైంగిక దాడి..

పిల్లలు ఎలాంటి వాతావరణంలో పెరిగితే అలాంటి అభిరుచులకు అలవాటు పడుతారని ఇప్పటికే నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే.. తల్లిదండ్రుల అవగాహన రాహిత్యం వల్ల.. చిన్నప్పటి నుంచి శృంగార ప్రభావం పిల్లలపై పడుతోంది. అలాంటి ఘటనే ఇది.. చిన్న వయసున్న అబ్బాయి.. తనకంటే చిన్నవయసున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఆరేళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్​లో జరిగింది. స్నేహితురాలితో కలిసి పొలానికి వెళ్లిన బాలికపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు ఆ బాలుడు. కరౌలి జిల్లా మంచారి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలకు వెళ్లిన బాలిక మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఇంటికి వచ్చింది. అనంతరం తన స్నేహితురాలితో కలిసి పొలానికి వెళ్లింది.

Differently abled minor girl raped in Delhi; accused arrested - India Today

ఆ సమయంలో నిందితుడు పొలం దగ్గరే ఉన్నాడు. మొదట బాధిత బాలిక చెప్పులను పంట పోలాల వైపు విసిరేశాడు బాలుడు. దీంతో బాలిక చెప్పుల కోసం వెళ్లింది. బాలికతో పాటే వెళ్లిన బాలుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారం చేశాడు. బాలిక అరుపులు విన్న తన స్నేహితురాలు భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఘటన అనంతరం ఏడుస్తూ ఇంటికొచ్చిన బాలిక.. తండ్రికి జరిగిన విషయం చెప్పింది. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపులు జరుపుతున్నట్లు పోలీసుల పేర్కొన్నారు.