తెలంగాణ వ్యాప్తంగా అందుబాటులోకి 134 వైద్య పరీక్షలు

-

రాష్ట్ర వ్యాప్తంగా 134 వైద్య పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ డయాగ్నోస్టిక్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ వైద్య పరీక్షలు అందించనుంది. కొండాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి వర్చువల్​గా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు 134 వైద్య పరీక్షలను ప్రారంభించారు. ఈ సమావేశంలో జిల్లాల నుంచి ప్రజా ప్రతినిధులు, వైద్యాధికారులు పాల్గొన్నారు. ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేద్దామని మంత్రి హరీశ్‌ రావు పిలుపునిచ్చారు.

సర్కారు దవాఖానల్లో అన్ని రకాల వైద్య సైవలు, పరీక్షలు ఉచితంగా అందిస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. టీ-డయాగ్నొస్టిక్స్‌లో 134 వైద్య పరీక్షలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. అన్ని పీహెచ్‌సీల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం లేదని హరీశ్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో టీ-డయాగ్నొస్టిక్స్‌ కేంద్రాలు, రేడియాలజీ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయని మంత్రి అన్నారు. మరో రెండు జిల్లాల్లో పనులు జరుగుతున్నాయని, త్వరలోనే వాటిని కూడా పూర్తి చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news