రాష్ట్రంలో వీధికుక్కల దాడులు విపరీతంగా పెరుగుతున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. తాజాగా వీధికుక్కల దాడులపై హరీశ్ రావు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో వీధికుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. కేవలం నిన్న ఒక్క రోజే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పసికందు మృతదేహాన్ని కుక్కలు పీక్కూ తినడం.. హైదరాబాద్ నార్సింగి పరిధిలో దివ్యాంగ చిన్నారి మర్మాంగాలపై కుక్కల దాడి, ఇబ్రాహీంపట్నం లో నాలుగేళ్ల చిన్నారి పై కుక్కల దాడి ఘటనలో మరణించిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలన్నింటి చూస్తుంటే హృదయవిధారక ఘటనలు చోటు చేసుకున్నాయి. కుక్క కాటు కేసులు నమోదైన తొలుతనే చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. దాదాపు 8 నెలల కాలంలో 343 కుక్క కాటు సంఘటనలు జరిగాయని తెలిపారు. రాష్ట్రంలో 3,79,156 వీధికుక్కలున్నాయని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించిందని తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిలిపివేయడం వల్ల పారిశుద్య నిర్వహణ పడకేసిందని తెలిపారు.