80% ట్రాఫిక్ సమస్యలపైనే డయల్ 100 కు కాల్స్ వస్తున్నాయి – సిపి ఆనంద్

-

డయల్ 100 కు 70% నుంచి 80% ట్రాఫిక్ సమస్యలపైనే కాల్స్ వస్తున్నాయని అన్నారు సిపి సివి ఆనంద్. ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయిందన్నారు. ట్రాఫిక్ ఫ్రీ మెయింటైన్ చేయాలంటే క్యారేజ్ వే ఫ్రీ గా ఉండాలని.. అప్పుడే వాహనాల రాకపోకలు సజావుగా సాగుతాయి అన్నారు. కోవిడ్ ఇబ్బందులతో ఎన్ఫోర్స్మెంట్ సీరియస్ గా చేయడం లేదన్నారు.

రాబోయే రోజులలో ప్రతి పోలీస్ స్టేషన్ లో రెండు టోయింగ్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పార్కింగ్స్ సౌకర్యం లేకుండా కమర్షియల్ కాంప్లెక్స్ లను ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమన్నారు. జిహెచ్ఎంసితో కలిసి ట్రాఫిక్ సిబ్బందితో ఎన్ఫోర్స్మెంట్ చేస్తామన్నారు. అలాగే బస్ బే లను రివైవ్ చేస్తున్నామనిి అన్నారు. బస్టాప్ లను ఆర్టీసీ అధికారులతో మాట్లాడి రీ లోకేట్ చేపిస్తామన్నారు. ఆర్టీసీ డ్రైవర్లకు కౌన్సిలింగ్, అవేర్నెస్ కార్యక్రమాలను చేపడతామన్నారు.

అలాగే ఆటో డ్రైవర్ల సమస్య చాలా ఉందని.. వీలైనంతవరకు ఆటో స్టాండ్లను ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఎన్ఫోర్స్మెంట్ చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ క్రమశిక్షణ కచ్చితంగా ఉండాలన్నారు సివి ఆనంద్. టెక్నాలజీ పరంగా రాబోయే రోజులలో లైవ్ అప్డేట్స్ చెప్పేలా గూగుల్ తో కలిసి చర్యలు చేపట్టబోతున్నామన్నారు. ఫ్రీ లెఫ్ట్ ఉల్లంఘించే వారిపై సీరియస్ గా చర్యలు తీసుకుంటామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news