బోరబండలో విషాదం…ఫోన్ పోయిందని రైలు కింద పడి ఆత్మహత్య

-

హైదరాబాద్ బోరబండ లో విషాదం చోటు చేసుకుంది. మొబైల్‌ ఫోన్‌ పోయిందని.. రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ బోరబండ లో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. తండ్రి కొనిచ్చిన మొబైల్‌ ఫోన్‌ పోయిందని.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు సాయి అనే యువకుడు.

Emi లతో రెండు సెల్ ఫోన్ కొనిచ్చాడు సాయి తండ్రి. అయితే… వరుసగా రెండు మొబైల్‌ ఫోన్‌ లు పోగొట్టుకున్నాడు సాయి. ఈ తరుణంలోనే… ఇవాళ ఉదయం పూట సెల్ ఫోన్లు పోయాయనే బాధతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు సాయి. దీంతో సాయి కుటుంబం విషాదంలోకి వెళింది. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news