హైదరాబాద్ లో వింత ఘటన.. భూమిలోంచి పొగలు !

-

హైదరాబాద్ మహానగరంలో వింత ఘటన చోటుచేసుకుంది. భూమిలోంచి పొగలు రావడం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన చూసిన హైదరాబాద్లో ఉన్న వాహనదారులు అలాగే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘటన హైదరాబాదులోని జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ సమీపంలోని నేల నుంచి పొగలు రావడం కలకలం రేపుతోంది.

A strange incident in Hyderabad.. smoke from the ground!

ఒక వైపు వర్షం కురుస్తున్న నేపథ్యంలో… తడిగా ఉన్న భూమి నుంచి పొగలు రావడంతో జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూమి నుంచి పొగలు రావడం తో అక్కడ ఉన్న వాహనదారులు అలాగే స్థానికులు.. భయంతో పరుగులు తీయడం కూడా జరిగింది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. అయితే దీని పై అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. మరికాసేపట్లోనే సంఘటన స్థలానికి వచ్చి అధికారులు పరిశీలించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version