ఖమ్మంలో షా సభ..ఈటల సైడ్..బండి ఫోకస్..చేరికలు లేవా?

-

తెలంగాణలో అధికారంలోకి రావాలనేది బి‌జే‌పి కంటున్న కల..ఆ కలని సాకారం చేసుకోవాలని కమలం నేతలు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. మొన్నటివరకు బి‌జే‌పి నేతలు దూకుడుగానే పనిచేశారు. అటు కేంద్రం పెద్దలు కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఇంకా అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకి బి‌జే‌పి గట్టి పోటీ ఇస్తుందనే సమయంలో..సమీకరణాలు మారిపోయాయి. బి‌జే‌పిలో అనూహ్యంగా చేరికలు లేకపోవడం..అటు కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో తెలంగాణలో సమీకరణాలు మారిపోయాయి.

కాంగ్రెస్ అనూహ్యంగా రేసులోకి వచ్చింది. పైగా గ్రౌండ్ లెవెల్ లో ఆ పార్టీకే బలం ఎక్కువ ఉంది. దీంతో కాంగ్రెస్ లోకి వలసలు కూడా ఊపందుకున్నాయి. కీలక నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు సైతం కాంగ్రెస్ లో చేరడానికే రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే వీరిని బి‌జే‌పిలోకి తీసుకురావడానికి ఈటల రాజేందర్ గట్టిగానే ట్రై చేశారు. పలుమార్లు భేటీ అయ్యారు. కానీ వారిద్దరు మాత్రం బి‌జే‌పిలోకి రావడానికి ఆసక్తి చూపలేదు. ఆ విషయం ఈటల డైరక్ట్ గా చెప్పేశారు. వారిద్దరు బి‌జే‌పిలో రావడం కష్టమని, పైగా తనని మార్చేలా మోటివేషన్  చేస్తున్నారని ఆ మధ్య చెప్పారు.

ఇక ఈ చేరిక ఫెయిల్ కావడంతో ఈటల..ఇంకా చేరికలపై దృష్టి పెట్టలేదు. పార్టీలో సైలెంట్ అయ్యారు. ఇదే సమయంలో ఈ నెల 15న ఖమ్మంలో అమిత్ షా సభ ఉంది. ఆ సభ ఏర్పాట్లు బండి సంజయ్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇదే సమయంలో ఈటల..అస్సాంకు వెళుతున్నారు. దీంతో ఈటల కావాలని సైడ్ అవుతున్నారా? అనే ప్రచారం వస్తుంది. ఇటు షా సభని విజయవంతం చేయాలని బండి ఫోకస్ పెట్టారు. ఖమ్మంలో బి‌జే‌పికి పట్టు తక్కువ..అందుకే ఎలాగైనా జన సమీకరణ చేయడానికి చూస్తున్నారు. షా సభలో బి‌జే‌పిలోకి పెద్దగా చేరికలు ఉండవని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news