నేడు తెలంగాణకు అమిత్ షా రానున్నారు. బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించే విజయ సంకల్ప సభలో పాల్గొననున్నారు అమిత్ షా. ఇందుకు సంబంధించి.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు బిజెపి నేతలు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు అమిత్ షా.
అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నేరుగా చేవెళ్లకు 6 గంటలకు వెళ్తారు. రాత్రి 7 గంటలకు సభ ముగించుకుని రోడ్డు మార్గం ద్వారా శంషాబాద్ విమానాశ్రయానికి వస్తారు. 7 గంటల 50 నిమిషాలకు ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. విజయ సంకల్ప సభకు సంబంధించి బీజేపీ రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయం వేడెక్కిన తరుణంలో అమిత్ షా పర్యటన మరింత వేడి రాజేస్తోంది..అటు అమిత్ షా టూర్ షెడ్యూల్ మారింది. ఆస్కార్ అవార్డు విన్నర్స్ ఆర్ ఆర్ ఆర్ టీంతో సమావేశం రద్దు చేసుకున్నారు. బీజేపీ ముఖ్య నేతలతో కూడ సమావేశం వాయిదా పడింది.