SBI గుడ్ న్యూస్..కస్టమర్లకు కొత్త సర్వీసులు.. బ్యాంకుకు వెళ్లేపని లేకుండానే..

-

దేశీయ అతి పెద్ద బ్యాంకు ఎస్బిఐ తన కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రెడీ వుతోంది. దీని వల్ల కస్టమర్లకు బెనిఫిట్ కలుగనుంది.. ఎస్‌బీఐ ఐరిష్ స్కానర్ సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. దీని వల్ల సీనియర్ సిటిజన్స్‌కు ఎక్కువగా బెనిఫిట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. పెన్షన్ పొందటానికి ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. ఈజీగానే పెన్షన్ పొందొచ్చు.. సీనియర్ సిటిజన్స్‌కు కొంత మందికి ఫింగర్ ప్రింట్ సరిగా పడకపోవచ్చు. ఇలాంటి వారికి పెన్షన్ పొందడంలో ఇబ్బందులు రావొచ్చు.

అందుకే ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ఎస్ఐబీ ఐరిష్ స్కానర్ సర్వీసులు అందుబాటులోకి తీసుకురానుంది.. అయితే ఈ సేవలను కరస్పాండెంట్స్ లేదా సర్వీస్ కస్టమర్ పాయింట్ల వద్ద ఐరిష్ స్కానర్ సేవలు అందుబాటులో ఉండేలా ఎస్‌బీఐ తగిన చర్యలు తీసుకోనుంది. ఇక సీనియర్ సిటిజన్ ఎటువంటి సేవలునైనా ఇంట్లో నుంచే చేసుకోవచ్చు..వాళ్ళు ఇబ్బందులు పడకుండా బీసీ లేదా సీఎస్‌పీ వద్ద ఐరిష్ స్కానర్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నామని ఎస్‌బీఐ తెలిపింది..

ఈ పద్ధతి ద్వారా సీనియర్ సిటిజన్స్ కు మంచి బెనిఫిట్స్ ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.. ఒంట్లో సత్తువు లేకుంటే కష్టాలు పడాలి.. అందుకు ఈ కొత్త సర్వీసులను అందిస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.. అలాగే బ్యాంక్ మిత్ర లేదా సర్వీస్ పాయింట్లకు సంబంధించిన రూల్స్‌ను కూడా సవరిస్తున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది.. ఏదేమైనా కొత్త సర్వీసుల వల్ల ప్రధానంగా సీనియర్ సిటిజన్స్‌కు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కువ దూరం వెళ్లాల్సిన పని లేకుండా ఈజీగానే పెన్షన్ డబ్బులు పొందే వెసులుబాటు లభిస్తుంది.. ఇది నిజంగా వారికి గుడ్ న్యూసే..

Read more RELATED
Recommended to you

Latest news