ఆంధ్రావాళ్ళు తెలంగాణ పబ్లిక్ కమిషన్ లో ఉన్నారు – జీవన్ రెడ్డి

-

ఉపాధి కరువై నిరాశతో ఆత్మహత్య చేసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా మునిసిపల్ బి వై నగర్ కి చెందిన నవీన్ కుటుంబాన్ని ఆదివారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రావాళ్లు తెలంగాణ పబ్లిక్ కమిషన్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు జీవన్ రెడ్డి. 9 ఏళ్లలో 60 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ తెలంగాణ.. ఇప్పుడు ఐదు లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగికి ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించడం మంత్రి కేటీఆర్ బాధ్యత అని తెలిపారు. నవీన్ కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news