తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1,663 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాల భర్తీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్( టీఎస్పీఎస్సీ) ద్వారా జరగనుంది.
ఆర్థిక శాఖ తాజాగా అనుమతి మంజూరు చేసిన ఉద్యోగాల్లో ఇంజనీరింగ్ విభాగంలో 1,522 పోస్టులు, నీటిపారుదల శాఖలో 704, ఏఈఈ 227, టెక్నికల్ పోస్టులకు 212 అనుమతినిచ్చింది. అలాగే నీటిపారుదల శాఖలో 95 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది.