తెలంగాణ ఎంసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది ఎంసెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు తమ హవా చూపించారు. మొదటి పది ర్యాంకుల్లో ఏడుగురు ఏపీ విద్యార్థులే ఉండటం గమనార్హం. మరోవైపు ఎప్పటిలాగే ఈ ఫలితాల్లోనూ బాలికలు తమ సత్తా చాటారు.
ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం, అగ్రికల్చర్&మెడికల్‌లో 86 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ టాప్-10లో 8 మంది, అగ్రికల్చర్&మెడికల్ విభాగాల టాప్-10లో ఏడుగురు ఏపీ విద్యార్థులే ఉండటం గమనార్హం.
ఇంజినీరింగ్ టాపర్లు..
1. సనపల అనిరుధ్ (విశాఖపట్నం)
2. ఎక్కింటిపాని వెంకట మణిందర్ రెడ్డి (గుంటూరు)
3. చల్లా ఉమేశ్ వరుణ్ (నందిగామ)
4. అభినీత్ మాజేటి (కొండాపూర్)
5. పొన్నతోట ప్రమోద్‌కుమార్‌రెడ్డి (తాడిపత్రి)
6. మారదాన ధీరజ్‌కుమార్ (విశాఖపట్నం)
7. వడ్డే శాన్వితారెడ్డి (నల్గొండ)
8. బోయిన సంజన (శ్రీకాకుళం)
9. నంద్యాల ప్రిన్స్ బ్రన్హమ్‌రెడ్డి (నంద్యాల)
10. మీసాల ప్రణతి శ్రీజ (విజయనగరం)
అగ్రికల్చర్&మెడికల్ టాపర్లు..
1. బూరుగుపల్లి సత్యరాజ జశ్వంత్ (తూర్పుగోదావరి జిల్లా)
2. నశిక వెంకటతేజ (చీరాల)
3. సఫల్‌లక్ష్మి పసుపులేటి (సరూర్‌నగర్)
4. దుర్గెంపూడి కార్తికేయరెడ్డి (తెనాలి)
5. బోర వరుణ్ చక్రవర్తి (శ్రీకాకుళం)
6. దేవగుడి గురు శశిధర్‌రెడ్డి (హైదరాబాద్)
7. వంగీపురం హర్షిల్‌సాయి (నెల్లూరు)
8. దద్దనాల సాయి చిద్విలాస్‌రెడ్డి (గుంటూరు)
9. గంథమనేని గిరివర్షిత (అనంతపురం)
10. కొల్లబాతుల ప్రీతమ్ సిద్ధార్థ్ (హైదరాబాద్)