రైతులతో పెట్టుకుంటే అంతే.. బీజేపీ భరతం పట్టడం ఖాయం.. కేంద్రంపై బాల్క సుమన్ ఫైర్.

-

రైతులతో పెట్టుకున్నోళ్లు ఎవరు బాగుపడినట్లు చరిత్రలో లేదని టీఆర్ఎస్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు రైతులతో పెట్టుకుని ఎటూ కాకుండా పోయాడన్నారు. బీజేపీకి కూడా అదే గతి పడుతుందని…

 

 

 

ఆ పార్టీకి రైతులు తలకొరివి పెడుతారని అన్నారు. ఇకనైనా బీజేపీ రాష్ట్ర నాయకులు చిల్లర రాజకీయం పక్కనపెట్టి కేంద్రంతో ధాన్యం కొనుగోలుకు ఒప్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీ వెళ్తే… నూకలు తినండి.. నూకలు అలవాటు చేయండని కేంద్రమంత్రి తెలంగాణ ప్రజలను అవమానించారని బాల్క సుమన్ మండిపడ్డారు. దాన్ని ఖండించాల్సిన బీజేపీరాష్ట్ర నేతలు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. పైగా కేంద్రమంత్రి అలా అన్నాడని చెప్పేందుకు… మీ వద్ద వీడియోలు ఉన్నాయా అని బుకాయించడం దుర్మార్గమన్నారు. తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందని… రైతాంగం పొట్టకొట్టే ప్రయత్నాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ రేషన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పే బీజేపీ… ధాన్యం కొనుగోలు విషయంలో మాత్రం దేశమంతా ఒకే పాలసీని ఎందుకు తీసుకురావట్లేదని ప్రశ్నించారు. త్వరలోనే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ తీర్మానాలను ప్రధాని నరేంద్ర మోదీకి పంపిస్తామన్నారు. కేంద్రం దిగి రాకపోతే ఎక్కడికక్కడ రైతులను సమీకరించి పోరాటం ఉధృతం చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news