BJP పార్టీకి అభ్యర్థులు కరువైయ్యారని తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వేములవాడలో సీనియర్ బిజెపి కార్యకర్తల సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మరోసారి నోరు జారారు.
పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువైన పార్టీ బిజెపి పార్టీ అని అన్నారు. “డిపాజిట్ గల్లంతయ్యే పార్టీ కాంగ్రెస్ పార్టీ, పోటీ చేయడానికి అభ్యర్థులు కరువైన పార్టీ భారతీయ జనతా పార్టీ” అన్నారు. ఇదంతా కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ ముందే అనడం గమనార్హం. అంతేకాదు.. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు ప్రకాష్ జవదేకర్ తో పాటు తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు పలువురు పాల్గొన్నారు. కాగా, బండి వాక్యాలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.
శ్రద్ధగా వినండి అర్థం కాకపోతే మళ్లీ వినండి…😂😂😂 pic.twitter.com/4XVlnUzy7n
— 𝐁𝐚𝐧 B̷J̷P̷ (@BanBJP39281235) June 11, 2023