సీఎం కేసీఆర్ పేరును గిన్నిస్ బుక్ రికార్డుల్లో ఎక్కించాలి – బండి సంజయ్

-

అబద్దాల్లో, హామీలిచ్చి మాట తప్పడం లో కేసీఆర్ కు గిన్నిస్ బుక్ రికార్డు లో చోటు కల్పించవచ్చని.. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చి బీసీ కోటాలో కలిపితే వ్యతిరేకంగా కొట్లాడిన పార్టీ బీజేపీ మాత్రమేనని బండి సంజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ కళ్యాణమండపం లో జరిగిన బీజేపీ ఓబీసీ మోర్చా బీసీ విద్యా వంతుల సదస్సులో బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనాడు బీసీ సంఘాలు, కుల సంఘాల నేతలు ఎందుకు నోరు మెదపలేదు? కొందరు బీసీ సంఘాల నేతలు పైసలకు అమ్ముడుపోయారన్నారు.

బీసీ సంఘాలు, కుల సంఘాల నేతలు చెబితే ఓట్లు పడే రోజులు పోయాయి… కుల సంఘాలను కేసీఆర్ కలుషితం చేశారని ఫైర్ అయ్యారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని.. కుల సంఘాలు చెబితే ఓట్లు పడితే మేం గెలిచేవాళ్ళమే కాదని చెప్పారు. 2014లో టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టిన నాటినుండి బిసిలకు ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలేదని.. రాష్ట్ర జనాభాలో 50% గా ఉన్న బిసిల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసింది శూన్యమని మండిపడ్డారు.

ఏరుదాటాక తెప్ప తగలేసినట్లు 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్‌ చేసిన వాగ్ధానాలన్నీ జూఠా మాటలే అని తేలిపోయిందని.. దళితబంధు లాగే ‘‘బిసి బంధు పథకం’’ ప్రవేశపెట్టాలని బిసిలు కోరుతున్నా ప్రభుత్వ చెవులకు ఎక్కడం లేదని మండిపడ్డారు. సబ్సిడీ రుణాలకోసం ధరఖాస్తు చేసుకొని 5.50 లక్షలమంది గత నాలుగేళ్ళుగా ఎదరుచూస్తున్నారని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news