కాంగ్రెస్ నాయకుల మీద బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడు అయోధ్యలో పుట్టిండని గ్యారంటీ ఏంటి అంటున్నారు.. మీరు మీ అమ్మకే పుట్టారని గ్యారంటీ ఏంటి అంటూ బండి సంజయ్ వివాదానికి తెరలేపారు. అయితే.. పొన్నం ప్రభాకర్ ను ఉద్దేశించి…బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు. దీంతో బండి సంజయ్ పర్యటనను అడ్డుకునేందుకు పొన్నం ప్రభాకర్ అనుచరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగుతున్నారు.
మంత్రి పొన్నం పై బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా ప్రజాహిత యాత్ర అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రజాహిత యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారు. దీంతో పోలీసులు…..భారీగా మోహరించారు. అటు కాంగ్రెస్ తీరుపై కాషాయ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ డౌన్ డౌన్… ఖబడ్దార్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రజాహిత యాత్ర క్యాంపు వైపు రాకుండా నిలువరించారు పోలీసులు.కాంగ్రెస్ నేతలు కర్రలతో వస్తుంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు.