ఇటీవల ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన సంఘటన తెలంగాణలో తీవ్ర కళకళం రేపింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళలను పరామర్శించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కేవలం రికార్డు కోసం ఒక్క గంటలోపు 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి.. నలుగురు మహిళల ప్రాణాలు పోవడానికి కారణమైందంటూ తీవ్ర విగ్రహం వ్యక్తం చేశారు.
సీఎంకు పేరు ప్రఖ్యాతలుు ముఖ్యమా.. పేదల ఆరోగ్యం ముఖ్యమా? అని ప్రశ్నించారు. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను సీఎం ఎందుకు పరామర్శించడం లేదని ఫైర్ అయ్యారు బండి సంజయ్. కెసిఆర్ నువ్వు మనిషివా.. రాక్షసుడివా.. నీ నిర్లక్ష్యం వల్లే నలుగురి మహిళలు ప్రాణాలు కోల్పోయారంటూ మండిపడ్డారు. ఇక్కడ మరణించిన వారిని పట్టించుకోకుండా రాజకీయాలు చేయడానికి బీహార్ వెళ్లాడని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.