బీజేపీ కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. రాహుల్ దమ్ముంటే ఓయూలో తిరగగలవా? అంటూ బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు.నిరుద్యోగం అంటువ్యాధిలా విస్తరిస్తోంది తెలంగాణలోనే…. దేశానికి ‘మోదీ’యే గ్యారంటీ అని నిరూపించారన్నారు. 8 ఎంపీ స్థానాలు గెలిపించిన ‘తెలంగాణ ప్రజలకు’ నా సెల్యూట్ అంటూ కితాబ్ ఇచ్చారు బండి సంజయ్ కుమార్.
ప్రధాని కాగానే కిసాన్ సమ్మాన్ నిధిపై సంతకం చేసిన నేత మోదీ…. తెలంగాణలో కాంగ్రెస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం అని జనం తేల్చేశారున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని…కార్యకర్తల కష్టార్జితంతోనే మేం గెలిచామని తెలిపారు. తెలంగాణలో ఈసారి బీజేపీదే అధికారం అన్నారు. 3వ సారి మోదీ ప్రభుత్వానికి అవకాశమిచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంజయ్… కీలక వ్యాఖ్యలు చేశారు.