బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని పోలీసులు అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్ నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. బండిని అరెస్ట్ చేశారని తెలుసుకున్న కాషాయ శ్రేణులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేశారు. ఈ క్రమంలో పరిస్థితులు అదుపు తప్పకూడదని భావించిన పోలీసులు బండి సంజయ్‌ను పార్టీ కార్యాలయానికి తరలించారు. కార్యాలయం నుంచి మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌పై ఆరా తీస్తున్నారు.
మునుగోడులోనే మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదంటూ బండి సంజయ్ బుధవారం అర్ధరాత్రి దాటాక హైదరాబాద్ నుంచి ఆ నియోజకవర్గానికి బయల్దేరగా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నగరం నుంచి వెళ్తున్న బండిని పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు. చివరకు అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు .అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్‌లో బండి సంజయ్‌ని అర్ధరాత్రి నుంచి నిర్బంధించారు. బండి సంజయ్ వెంట వీరేందర్ గౌడ్, ఎన్.వి సుభాష్, సంగప్ప ఉన్నారు.