మోదీ చేసిన మోసానికి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి – మంత్రి జగదీశ్ రెడ్డి

-

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం లేపుతుంది. ప్రతిపక్షాలు అన్నీ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. ఈ ఘటనకు మంత్రి కేటీఆర్ కారణమని ఆరోపిస్తున్నాయి. పేపర్ లీకేజీ ఘటనపై నేడు బిజెపి.. ధర్నా చౌక్ లో ” మా నౌకరీలు మాగ్గావాలే” అనే నినాదంతో మహధర్నా చేపట్టారు. అయితే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన దీక్షపై మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బండి సంజయ్ దీక్ష చేయవలసింది ఢిల్లీలో అని అన్నారు.

గడిచిన తొమ్మిదేళ్లుగా ఉద్యోగాల గురించి ప్రధాని మోడీ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. మోడీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బిజెపి నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ చేసిన మోసానికి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో అత్యధిక ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చింది తామేనని.. నోటిఫికేషన్ చర్చకు బండి సంజయ్ సిద్ధమా అని సవాల్ విసిరారు. టీఎస్పీఎస్సీ లో ఇంటి దొంగలను పట్టుకుంది తామేనని అన్నారు. బిజెపి ఎన్ని దీక్షలు చేసినా రాజకీయ నిరుద్యోగులుగానే మిగిలిపోతారని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news