సోమేశ్ కుమార్ పై భట్టి విక్రమార్క ఫైర్

-

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర నేడు షాద్ నగర్ నియోజకవర్గం లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఆరోగ్యం సహకరించడం లేదంటూ ఆంధ్ర ప్రదేశ్ లో విఆర్ఎస్ తీసుకున్న మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ను తెలంగాణ సీఎం చీఫ్ అడ్వైజర్ గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. సోమేశ్ కుమార్ కి ఆంధ్రాలో ఉద్యోగం చేయడానికి లేని ఆనందం తెలంగాణలో ఏముందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పోస్ట్ ఎందుకు ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రిటైర్డ్ అయిన అధికారులు మిగతా వారికి అవకాశం ఇచ్చి.. అధికారం నుంచి తప్పుకోవాలని సూచించారు. సోమేశ్ కుమార్ కి ఆంధ్రలో పనిచేయడం చేతగాక మళ్ళీ తెలంగాణలో అడుగు పెట్టారని విమర్శించారు. మాజీ చీఫ్ సెక్రటరీగా, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా, సీసీఎల్ఏ కమిషనర్ గా పనిచేసిన సోమేశ్ కుమార్ కి కోర్టు కేసుల్లో ఉన్న భూములను సైతం రాజీ చేయించి ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేసిన చరిత్ర ఉందన్నారు. వందల సంవత్సరాల నుంచి పేదలు కాపాడుకుంటూ వచ్చిన భూములను సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న అనంతరం మాయం చేశారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news