గుండెనొప్పులు: ఈ రోజుల్లో ఎక్కువ మంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు. గుండె సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా గుండె పోట్లు బాగా ఎక్కువైపోయాయి. చాలామంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు. దానికి కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. చాలా మంది ఎక్కువగా డబ్బులు సంపాదించాలని స్థాయికి మించి కష్టపడుతున్నారు. దీన్ని వలన ఒత్తిడి ఎక్కువవుతుంది గుండెపై ఒత్తిడి పడుతుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అధిక బరువు వలన కూడా గుండె సమస్యలు కలుగుతాయి. అధిక బరువు సమస్య తో బాధ పడే వాళ్ళలో చెడు కొవ్వు నిల్వ పెరిగిపోతుంది. దీంతో రక్తనాళాల్లో ఒత్తిడి కలుగుతుంది. రక్తం అడ్డు పడుతుంది. గుండె సమస్యలు వస్తాయి. షుగర్ ఉన్న వాళ్ళలో కూడా గుండె పోట్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. హృదయ సంబంధిత సమస్యలకు షుగర్ పేషెంట్లు గురవుతూ ఉంటారు. షుగర్ ఉంటే గుండె సమస్యలు కూడా బాగా పెరుగుతాయి. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా గుండె ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టడం ముఖ్యం.
కొలెస్ట్రాల్ వలన కూడా గుండె జబ్బులు వస్తూ ఉంటాయి. హై బీపీ ఉన్న వాళ్ళకి కూడా గుండె సమస్యలు ఎక్కువ వస్తాయి. రక్తనాళాల్లో రక్తప్రసరణ నెమ్మదిగా జరిగి గుండెకి ఆక్సిజన్ అందదు దీంతో గుండె జబ్బులు వస్తాయి సరైన జీవన విధానాన్ని అనుసరించకపోవడం వలన కూడా గుండె సమస్యలు ఎక్కువ వస్తాయి. చాలామంది వ్యాయామం కోసం సమయాన్ని వెచ్చించరు అటువంటి వాళ్ళలో గుండెజబ్బులు వస్తాయి. స్మోకింగ్ వలన కూడా గుండె సమస్యలు కలుగుతూ ఉంటాయి. చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి ఆహార పదార్థాలు చేర్చుకుంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపితే కచ్చితంగా గుండెపోటు మొదలైన సమస్యలు కలగవు.