విశ్వక్‌ సేన్‌ కు ఏమైంది?.. ఇలా మాట్లాడుతున్నాడు…

-

‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నామా దాస్‌’, ‘ చిత్రాలతో మాస్‌ కా దాస్‌గా పేరు తెచ్చుకున్న టాలీవుడ్‌ మాస్‌ హీరో విశ్వక్‌ సేన్‌. ఆన్‌స్క్రీన్ లేదా ఆఫ్ స్క్రీన్.. ఎప్పుడూ చలాకీగా, ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపిస్తారు. సోషల్‌మీడియాలోనూ ఎప్పుడు సరదా పోస్టులు, ఫన్నీ మీమ్స్‌ షేర్‌ చేసే ఆయన తాజాగా ఓ సందేశాత్మక పోస్ట్‌ పెట్టారు. లైఫ్ లో తాను జయాపజయాలను చూశానని చెప్పారు. అలాగే, కొన్నిసార్లు చేయని తప్పులకు కూడా నిందలు పడ్డానని తెలిపారు. తనపై వ్యతిరేకత సృష్టించినప్పటికీ తాను ఏ ఒక్కరికీ ద్రోహం చేయలేదని చెప్పుకొచ్చారు.

Vishwak Sen romances 4 actresses in a Tamil-Telugu bilingual ...

“విజయం, పరాజయం, ప్రశంసలు, విమర్శలు రెండింటినీ చూశాను. అలాగే నేను చేయని తప్పులకు ప్రశ్నలు ఎదుర్కొన్నాను, నిందలు పడ్డాను. నా హార్డ్‌వర్క్‌కు ప్రశంసలు అందుకున్నాను. ఒకవేళ తెలియక చేసిన తప్పుల వల్ల విమర్శలు ఎదుర్కొని ఉండొచ్చు. కానీ, ఎవరికీ హానీ చేయలేదు. పోరాటాలు జరుగుతున్నప్పటికీ నా జర్నీ ని ముందుకు కొనసాగిస్తున్నాను. ఉద్దేశపూర్వక ప్రతికూలత.. నిన్ను ఒక ఫెయిల్యూర్‌గా నిర్వచించడానికి తావు ఇవ్వొద్దు. కష్ట సమయాలకు మించి జీవితంలో మరెంతో ఉంటుంది. మానవ జన్మ ఎత్తినందుకు ఆనందించండి. కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడండి” అంటూ విశ్వక్‌ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టారు. ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన విశ్వక్‌ సేన్‌ అభిమానులు ఉన్నట్టుండి ఆయన ఇలాంటి సందేశం ఎందుకు పట్టాడా.. అని చర్చిస్తున్నారు.

సినిమాల విషయానికి వస్తే విశ్వక్‌ సేన్‌ రీసెంట్ గా ‘దాస్‌ కా ధమ్కీ’తో విశ్వక్‌ సేన్‌ ప్రేక్షకులను అలరించారు. మాస్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ఆయనే స్వీయ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ముందు మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. దీని తర్వాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఊరమాస్‌ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రీసెంట్ గా ఆ సినిమా షూట్‌ మొదలైంది. ఇందులో విశ్వక్‌ కాస్త సీరియస్‌ లుక్‌లో కనిపించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news