మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా.. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని.. పార్టీ అధినేత సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మునుగోడు అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్.
సుషీ ఇన్ ఫ్రా పేరుతో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.22 వేల కోట్ల కాంట్రాక్టు రాజగోపాల్ రెడ్డి తీసుకున్నారని, రూ.5 వేల కోట్లు ఖర్చు పెడతానని అమిత్ షా కు రాజగోపాల్ మాట ఇచ్చారని ఆరోపించారు. తమపై ఐటి, ఈడి, సిబిఐ లను వేట కుక్కల ప్రయోగిస్తారని, తమపై జరిగే దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పనీ కథమైందని, ప్రధాన ప్రతిపక్షంగా ఆ పార్టీ విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు కీలక నేతలు త్వరలో టిఆర్ఎస్ లోకి రాబోతున్నట్లు వెల్లడించారు.