రోజు చప్పట్లు కొడితే ఎన్నో లాభాలు.. పైసా ఖర్చులేకుండా పనైపోతుంది..!!

-

ఓడినవారికి ఓదార్పు ఎంత అవసరమో.. గెలిచిన వారికి ప్రోత్సాహం కూడా అంతే అవసరం.. అలా ప్రోత్సాహించడంలో చప్పట్లు ఎంతో ఉత్తేజాన్ని ఇస్తాయి.. మనం స్టేజ్‌ మీద చేసే పర్ఫామెన్స్‌కు ఆడియన్స్‌ నుంచి దద్దరిల్లేలా చప్పట్లు వస్తే ఇక ఆ మజానే వేరు.. అయితే చప్పట్లు కొట్టడం వల్ల ఎన్నో వ్యాధులు దూరం అవుతాయని మీకు తెలుసా.. రోజుకు కనీసం 5-6 నిమిషాలు చప్పట్లు కొట్టడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దామా..!

రెండు చేతులను మీ భుజాలకు ఎదురుగా పైకి లేపండి. చేతులను వీలైనంత వెడల్పుగా చాచి చప్పట్లు కట్టాలి. ఒక నిమిషం పాటు నెమ్మదిగా చప్పట్లు కొట్టండి. కాస్త అలసటగా అనిపిస్తే, మీ చేతులకు ఒకటిన్నర నిమిషాలు విశ్రాంతి ఇవ్వండి. ఆ తర్వాత మరో నిమిషం పాటు చప్పట్లు కొట్టండి. ఇలా 4-5 సార్లు చేయండి. ఒక వారంలో మీరు దానికి అలవాటు పడతారు. అలా నిమిషానికి సుమారు 50 నుండి 100 క్లాప్స్ కొట్టవచ్చు. అంటే 5 నిమిషాల్లో 300 నుండి 500 సార్లు చప్పట్లు కొట్టవచ్చనమాట.. ఇంతకీ ఇలా చేయడం వల్ల ఏంటి ఉపయోగం అనేగా మీ డౌట్..

ఉదయం రోజువారీ పనులు ముగించుకున్న తర్వాత 5 నిమిషాలు చప్పట్లు కొట్టడం అలవాటుగా పెట్టుకోండి. శరీరంలోని కొవ్వు తగ్గిపోతుంది. రక్తపోటు సాధారణ స్థాయికి చేరుకుంటుంది. మధుమేహం నియంత్రణలోకి వస్తుంది.. కంటి చూపు మెరుగుపడుతుంది. శరీరం యాక్టివ్‌గా మారుతుంది. చప్పట్లు కొట్టడంలో ఆక్యుప్రెషర్ సూత్రం దాగి ఉంది. ఇందులో రెండు అరచేతులపై ఉన్న వేల పాయింట్లపై చప్పట్లు కొట్టడం వల్ల ఒత్తిడి ఏర్పడి రక్తప్రసరణ సాఫీగా జరగడమే ఆరోగ్య ప్రయోజనాలకు కారణమని వైద్యులు అంటున్నారు.

రోజూ చప్పట్లు కొట్టడం ద్వారా పొట్ట సమస్య, మెడ, నడుము నొప్పి, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలను సైతం దూరం చేసుకోవచ్చచ.. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ వ్యాయామంలో చప్పట్లు కొడితే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. సో..అప్పుడప్పుడు చేసేయండి మరీ..!

Read more RELATED
Recommended to you

Latest news