జూనియర్ పంచాయతీ కార్యదర్శిలకు కేసీఅర్ సర్కార్ బిగ్ షాక్

-

సమ్మె చేస్తున్న జేపీఎస్ లకు తెలంగాణా సర్కార్ సూచనలు చేసింది. సమ్మె చేస్తున్న పంచాయతీ రాజ్ జూనియర్ సెక్రటరీలను చర్చలకు పిలిచేది లేదు…ఇవాళ మధ్యాహ్నం 12 గంటల లోపు డ్యూటీలో ఉన్నవారి లిస్ట్ పంపించాలని పేర్కొంది. డ్యూటీలో లేనివారు ఉద్యోగులు కారు…12 గంటల లోపు డ్యూటీలో లేని వారిని గుర్తించి ఆయా గ్రామాలను గుర్తించి లిస్ట్ డిపిఓలకు పంపాలన్నారు.

గ్రామ పంచాయతీ లలో గ్రామ సభ పెట్టి డిగ్రీ చదివిన వారిని తాత్కాలికంగా పంచాయతీ రాజ్ జూనియర్ సెక్రటరీ లుగా నియామకం చేయాలి…గతంలో పంచాయతీ రాజ్ జూనియర్ సెక్రటరీ పరీక్ష రాసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి లేదా రిజర్వేషన్ ప్రాతిపదికన నియమించాలని వెల్లడించింది. సమ్మె విరమించి వస్తే డ్యూటీలో జాయిన్ కావచ్చు లేదంటే ఇప్పటికి వారి టర్మ్ ముగిసింది కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ వారికి ప్రభుత్వం తో సంబంధం లేదనీ వివరించింది. పంచాయతీ రాజ్ జూనియర్ సెక్రటరీల విషయంలో టర్మీనెట్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news