రేపు అన్ని నియోజకవర్గాల్లో బిజెపి దీక్షలు – బండి సంజయ్

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనకు నిరసనగా రేపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రశ్నాపత్రం లీకేజీ పై సీట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీ వల్ల వేలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ ను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే నిరుద్యోగులకు లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీ వల్ల 30 లక్షల మంది నిరుద్యోగుల బతుకులు ఆగమయ్యాయని అన్నారు. పేపర్ లీక్ ఘటనలో మంత్రి కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని బండి సంజయ్.. రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలపై కేసీఆర్ స్పందించడని, మంత్రులకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదన్నారు.