వాస్తు: ఉగాది పండుగ లోగా వీటిని తొలగించండి… లేదంటే సమస్యలే..!

-

ఎలాంటి సమస్యలైనా సరే వాస్తు ప్రకారం అనుసరించి మనం గట్టెక్కేవచ్చు. చాలామంది ఇళ్లల్లో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మీ ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య వస్తోందా అయితే కచ్చితంగా పండితులు చెబుతున్న వాస్తు చిట్కాలని ట్రై చేసి చూడండి.

వీటిని కనుక అనుసరిస్తే ఏ బాధ లేకుండా ఆనందంగా ఉండొచ్చు. ఈసారి శోభకృత్ నామ సంవత్సరం వస్తోంది. ఈ తెలుగు సంవత్సరంతో కొత్త ఏడు మొదలవుతుంది ఈసారి ఉగాది పండుగ మార్చి 22వ తేదీన వచ్చింది.

ఉగాది అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటిని వారం రోజులు ముందే శుభ్రంగా ఉంచుకుంటారు పండుగకి ఇంటిని ఎంతో అందంగా అలంకరిస్తారు. కావలసిన సామాన్లు తెచ్చి పెట్టుకోవడం.. పండుగనాడు అందంగా ముగ్గులతో రంగులు వేయడం ఇంట్లో చెత్తాచెదాలను తొలగించడం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో పనులు..

అయితే ఈ ఉగాది ముందే ఈ వస్తువులను ఇంట్లో నుండి తొలగించండి లేకపోతే తిప్పలు తప్పవు. ఈ వస్తువులు నెగటివ్ ఎనర్జీ ని తీసుకువస్తాయి పైగా పాజిటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుపడతాయి ఇలాంటివి ఇంట్లో ఉండడం వలన నెగిటివ్ ఎనర్జీ వచ్చి పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుందని గుర్తు పెట్టుకోండి.

ఎప్పుడూ కూడా వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే దేవతల విగ్రహాలు దేవుళ్ళు విగ్రహాలు పగిలిపోయి ఉండకూడదు. పైగా అటువంటి వాటిని పూజ మందిరంలో పెట్టి పూజ చేయడం కూడా మంచిది కాదు ఇవి నెగిటివ్ ఎనెర్జీని తీసుకువస్తాయి. అటువంటి విగ్రహాలని నీళ్లలో కలిపేయడం మంచిది.
ఆగిపోయిన గడియారాలని పనిచేయని గడియారాలని ఇంట్లో అస్సలు ఉంచొద్దు. ఇవి కూడా నెగటివ్ ఎనెర్జీని తీసుకొస్తాయి పాజిటివ్ ఎనర్జీని దూరం చేస్తాయి.
పగిలిన గాజు సామాన్లు వంటివి కూడా ఇంట్లో ఉంచకూడదు. ఇవి ఆర్థిక ఇబ్బందుల్ని కలిగిస్తాయి.
వాడని మందులు ఎక్స్పైర్ అయిపోయిన మందులు చాలా మంది ఇళ్లల్లో అలా వదిలేస్తూ ఉంటారు కానీ ఇవి కూడా నెగిటివ్ ఎనర్జీ తీసుకువస్తాయి. పాజిటివ్ ఎనెర్జీని దూరం చేస్తాయి. కాబట్టి ఉగాది రాకముందు వీటిని తొలగించి ఇంటిని అందంగా మార్చుకోండి చక్కటి పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా మీ ఇంటిని మార్చేసి ఆనందంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news