బీజేపీకి తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదు – ఎంపీ ఉత్తమ్

-

పార్లమెంట్ లో మీరా కుమార్ చొరవతోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందన్నారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు చెప్పుకుంటున్న నాయకులు తలకిందులు వేలాడినా తెలంగాణ వచ్చేది కాదన్నారు. మోడీ… ప్రజాస్వామ్య విరుద్ధంగా కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అంటున్నారని పార్లమెంట్ లో మోడీ ఎన్నో సార్లు చెప్పారని గుర్తు చేశారు.

బీజేపీకి తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదన్నారు. మీరా కుమార్ కి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ కోరింది కెసిఆర్ అని కానీ.. మీరా కుమార్ కి వ్యతిరేకంగా ఓటేసినా చరిత్ర కెసిఆర్ దని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నెరేళ్లకు పోతా అంటే.. మీరా కుమార్ ని హేళన చేసిన వ్యక్తి కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version