బిజెపికి ఉన్నది ముగ్గురు.. మీ వల్ల ఏమవుతుంది – మంత్రి తలసాని

-

మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొంద బోతున్నారని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్ కుళ్ళు, కుతంత్రాలతో గెలవాలని చూస్తున్నాయని ఆరోపించారు. మేం గెలిస్తే 3వేలు పెన్షన్ ఇస్తామని చెప్తున్నాయని.. మరి దుబ్బాక, హుజురాబాద్ లో ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని కెసిఆర్ కోరుకున్నారని అన్నారు మంత్రి తలసాని. అందుకు గొల్ల, కురుమలకు ఆర్థికంగా బలోపేతం కోసం వారికి గొర్రెలను ఇస్తున్నామన్నారు. యూనిట్ కాస్ట్ ని కూడా పెంచి… లక్షా ఇరవై అయిదు వేల నుంచి 1,75 వేలకు పెంచామన్నారు. బీజేపీ నాయకులు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఈ స్కీమ్ కొద్ది రోజులు ఆగిపోయిందని.. మునుగోడు ఎన్నికలు అయిపోయిన తర్వాత యధావిధిగా కొనసాగిస్తామన్నారు.

రాష్ట్రంలో ఉన్న గొల్ల, కురుమలు ఆందోళన పడొద్దన్నారు . డబ్బులు రాకుండా ఆపడాని బీజేపీ, కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో చిల్లర రాజకీయాలు కుదరవని మండిపడ్డారు మంత్రి తలసాని. మీరు కేంద్రం నుంచి రూపాయి తెచ్చింది లేదు.. ఇచ్చింది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసమే ఈ ఉప ఎన్నిక వచ్చిందన్నారు. బీజేపీ కి ఉన్నది ముగ్గురు… మీ వల్ల ఎం అవుతుంది? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news