తెలంగాణ వ్యాప్తంగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశం దుమారం రేగుతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీలు తప్పు మీదంటే మీదేనంటూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. అయితే, ఈ నేపథ్యంలో ఈ కేసులో కీలక సూత్ర దారి అయిన, బిజెపి కీలక నేత బిఎల్ సంతోష్ తెలంగాణకు రానున్నారు.
ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలోనే ఉండనున్నారు. దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ విస్తారక్ ల శిక్షణ తరగతులకు హైదరాబాద్ వేదికకానుంది. ఈ శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై పలు అంశాలను నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్, బిఎల్ సంతోష్ పేరును చేర్చిన నేపథ్యంలో ఆయన పర్యటన రాజకీయంగా హీట్ పెంచనుంది.