రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని కేంద్రానికి వివరిస్తున్నాము : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

-

రాష్ట్రంలో గత మూడు, నాలుగు రోజులుగా నుంచి భారీ వర్షాల కారణంగా ఖమ్మం, హైదరాబాద్ తో పాటు, మహబూబాబాద్, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాల్లో ప్రాణనష్టం జరగడం దురదృష్టకరం అని అన్నారు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. తెలంగాణలో భారీ వర్షాలతో చాలా చోట్ల ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది, వరద ఉధృతికి రోడ్లు, రైల్వే లైన్లు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలకు జరిగిన ప్రాణ, ఆస్తినష్టంపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని కేంద్రానికి వివరిస్తున్నాము.

స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి వివరాలు తెలుసుకుని, అవసరమైన విధంగా రాష్ట్రానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారు. సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ నాయకులు, శ్రేణులు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే నష్టం అంచనాల నివేదిక ఆధారంగా కేంద్రం తగు సాయం అందిస్తుంది. రాష్ట్రంలో రెండు కేంద్ర బృందాలు ఏరియల్ సర్వే చేసి కేంద్రానికి నివేదిక అందిస్తాయి. రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు

Read more RELATED
Recommended to you

Exit mobile version