కాంగ్రెస్ అందరిపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. కవితకు బెయిల్ వస్తే బీజేపీకి ఏంటీ సంబంధం అని అడిగారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప. కాంగ్రెస్ అబద్ధపు మాటలు, మోసపు ప్రచారాలు మానుకోవాలి. రాజ్యాంగ నిబంధనలు కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలి. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచి మాట్లాడటం కాంగ్రెస్ నైజాం. మనీష్ సిసోడియా కు బెయిల్ రావడానికి బీజేపీ కారణమా అని ప్రశ్నించాడు.
అలాగే సుప్రీం కోర్టు ను బీజేపీ మ్యానేజ్ చేస్తే కవితకు బెయిల్ వచ్చిందని ప్రచారం చేయడం సుప్రీం కోర్టు ను అవమానించడమే. కవిత బెయిల్ కోసం వాదించింది కాంగ్రెస్ నేత అభిషేక్ మను సంఘ్వి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒప్పందం వల్లే అభిషేక్ సoఘ్వీ కవిత బెయిల్ కోసం సుప్రీం కోర్టులో వాదించారు. కవిత బెయిల్ కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన కవిత బెయిల్ కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలతో ఇంకెన్నాలు పబ్బం గడుకుంటుంది అని అన్నారు సంగప్ప.