బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ని తీవ్రంగా ఖండించారు ఎంపీ ధర్మపురి అరవింద్. రాష్ట్రంలో బిజెపి ఎదుగుదలను చూసి ఓర్వలేక బండి సంజయ్ ని అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కూతురు కవితపై ఈడి విచారణ అంశాలతో కేసీఆర్ ఫ్రస్టేషన్ లోకి వెళ్లిపోయారని.. అందుకే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
అక్రమ అరెస్టులకు బిజెపి నాయకులు భయపడరని.. మరింత దూకుడుగా ముందుకు వెళతామని స్పష్టం చేశారు. దేశ రాజకీయాలను నడిపించేంత డబ్బు కెసిఆర్ కి ఎక్కడి నుంచి వచ్చాయని తెలంగాణ సమాజం చర్చించుకుంటుందన్నారు అరవింద్. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు ఆటంకం కలిగించాలని కూడా సీఎం ప్రయత్నిస్తున్నారని అన్నారు. తెలంగాణలో ఎమర్జెన్సీ తరహా వాతావరణం నెలకొందన్నారు. బండి సంజయ్ ని వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.