ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు ప్రయత్నించిన ఫామ్‌హౌస్ ఘటనలో రూ.100 కోట్ల ఎక్కడివో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఈ ఫామ్‌హౌస్ ఘటనకు సంబంధించి ‘ఫామ్‌హౌస్ లీలలు’ సినిమాకు కేసీఆర్ దే డైరెక్షన్ అని ఎద్దేవా చేశారు. ముందు రూ.100 కోట్లని ఆ తర్వాత రూ.15 కోట్లన్నారని అంతా నగదు ఎక్కడుందో సైబరాబాద్ పోలీసులు, అధికార పార్టీ నేతలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ మారేందుకు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి వచ్చిన ముగ్గురు వ్యక్తుల మొబైల్స్ పోలీసులు సీజ్ చేసినట్లు చెప్పారని.. ఆ మొబైల్స్ ఎక్కడున్నాయని రఘునందన్ ప్రశ్నించారు.
ఫామ్‌హౌస్‌కు నగదు తీసుకుని వచ్చిన ముగ్గురు వ్యక్తుల డబ్బు ఎక్కడికి పోయిందని రఘునందన్ నిలదీశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫిర్యాదులో రూ.100 కోట్లు అని పేర్కొన్నారని ఆ సోమ్మంతా ఎక్కడి నుంచి వచ్చిందో కూడా విచారించాలని ఈడీకి ఫిర్యాదు చేశారు. బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆయన అధికారులను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన వాంగ్మూలాన్ని ఈడీ నమోదు చేసిందని చెప్పారు. తన ఫిర్యాదు ఆధారంగా పూర్తి వ్యవహారంపై ఈడీ దర్యాప్తు చేస్తుందని రఘునందన్ తెలిపారు.