ప్రభుత్వం రైతుల పొట్ట కొట్టే పని చేస్తుంది : బీజేపీ ఎంపీ లక్ష్మణ్

-

రైతుల దుస్థితి పై బీజేపీ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిర్ణయం మేరకు రైతులను కలుస్తున్నాం. మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మకై రైతుల పొట్ట కొట్టే పని చేస్తుంది అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. నెల రోజులుగా కుప్పలు పోసిన ధాన్యాన్ని కొనే వారు లేరు. కలెక్టర్.. అధికారులతో మాట్లాడాను.. సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. మూసీ ప్రక్షాళన పేరుతో పాదయాత్రలు కాదు.. రైతుల దగ్గరకు వెళ్లండి. మీ పాలన ఎలా సాగుతుందో రైతుల దగ్గరకు వెళ్తే అర్థం అవుతుంది. దున్నపోతు నిద్రల వ్యవహరిస్తున్న మంత్రులు ఏం చేస్తున్నారు. అకాల వర్షాలు వస్తే ధాన్యం ఏం అవ్వాలి. రైతులు ఎటు పోవాలి.

ఉదారంగా కేంద్రం రైతులను ఆదుకుంటుంది.. మీరు రైతుల పొట్ట కొడుతున్నారు. రేవంత్ ప్రభుత్వంలో క్వింటాల్ వడ్లపైన వెయ్యి రూపాయల నష్టానికి అమ్ముకుంటున్నారు. ధాన్యం కొనుగోలుకు కేంద్రమే డబ్బులు ఇస్తున్న ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు. సన్నాలకు బోనస్ అన్నారు.. ఇప్పటికీ లేదు. రైతు భరోసా.. కౌలు.. కూలి రైతులకు ఇచ్చిన హామీలన్నీ ఇప్పటికీ అమలు కాలేదు. రైతు భరోసా కాదు కదా.. ఇచ్చిన హామీలన్నీ బంద్ చేశారు అని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news