సంగారెడ్డిలో నేడు బీజేపీ నిరుద్యోగ మార్చ్

-

ముఖ్యమంత్రి కేసీఆర్ అనాలోచిత విధానాల వల్ల తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ నాశనమయ్యే ప్రమాదమేర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగ భృతిని అమలు చేయకుండా యువత బతుకులు అథోఃగతి పాలవుతున్నా సీఎం స్పందించకపోవడం బాధాకరమని మండిపడ్డారు.

10 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ మార్చ్‌ ద్వారా నిరుద్యోగులకు అండగా నిలవాలన్నదే బీజేపీ లక్ష్యమని బండి సంజయ్ స్పష్టం చేశారు. గత నెలలో ఉమ్మడి వరంగల్‌, పాలమూరు జిల్లాలో నిరుద్యోగ మార్చ్కు పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలివచ్చి విజయవంతం చేశారని గుర్తు చేసిన ఆయన.. ఆ అంశం దేశవ్యాప్తంగా చర్చ జరిగిందని పేర్కొన్నారు. నిరుద్యోగ మార్చ్ ద్వారా కేసీఆర్ నిరంకుశ, నియంత విధానాలపై గర్జించి గాండ్రించాలని యువతకు పిలుపునిచ్చారు. ఇవాళ సంగారెడ్డిలో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నామని.. దీనికి పెద్ద యెత్తున నిరుద్యోగులు తరలిరావాలని పిలుపునిచ్చారు.

TSPSC  పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్తోపాటు బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని నిరుద్యోగులకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news