బిజెపి సమాచార హక్కు దరఖాస్తుల ఉద్యమం.. 12 వేలకు పైగా గ్రామాల్లో దరఖాస్తులు సిద్ధం

-

తెలంగాణ బీజేపీ, రాష్ట్ర సర్కారును ఇరుకున పడేసే విధంగా సమాచార హక్కు దరఖాస్తుల ఉద్యమం కొనసాగిస్తుంది.వివిధ అంశాల పై సమాచారం ఇవ్వాలని ఆర్టిఐకి వేలాది ధరకాస్తులు పెడుతున్నారు బిజెపి నేతలు.ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో వివిధ అంశాల పై సమాచారం ఇవ్వాలని ధరకాస్తు పెట్టారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.తాజాగా రాష్ట్రము లోని అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శి లకు సమాచార హక్కు ధరకాస్తులు పెట్టాలని సూచించారు. దీంతో 12 వేలకు పైగా గ్రామాల్లో ఆర్టిఐ ద్వారా సమాచారం కోరనుంది బిజెపి.

దీనికి గల ధరకాస్తులు సిద్దం చేస్తున్నారు బిజెపి నేతలు.ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన నిధులు … ఖర్చు చేసిన వివరాలు…గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం… ఇలా తదితర అంశాలపై దరఖాస్తులు పెట్టనున్నారు.వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఆయా గ్రామాలకు వచ్చిన నిధులు… లబ్ది దారుల వివరాలు కోరనున్నారు.హరిత హరం, గ్రామీణ ఉపాధి హామీ, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు తదితర వివరాలు అడుగనుంది బిజెపి.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి.

మా ధరకాస్తు వల్లనే ఉద్యోగ నియామకాల్లో కదలిక వచ్చిందన్నారు. టీచర్ పోస్ట్ ఖాళీలు,డబల్ బెడ్ రూం ఇళ్ళ సమాచారం మాకు వచ్చిందన్నారు.కెసిఆర్, కేటీఆర్ లు చెబుతున్న అబద్ధాలను ప్రజల ముందు పెడతామన్నారు ఇంద్రసేనారెడ్డి.ఇప్పటికీ 20 జిల్లాలకు ఆర్టిఐ ధరకాస్తులు పెట్టామన్నారు.మూడు, నాలుగు రోజుల్లో అన్ని గ్రామాలకు దరఖాస్తులు వెళ్తాయన్నారు.సమాధానం ఇవ్వక పోతే అప్పీల్ కి వెళ్తామన్నారు.ట్రాక్టర్ లు ఎన్ని సంక్షన్ అయ్యాయో ఎంపీడీఓ లను అడుగుతున్నామన్నారు.గ్రామం నుండి రాష్ట్రం వరకు ఆర్ టి ఐ ద్వారా సమాచారం అడుగుతున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news