తెలంగాణ వ్యాప్తంగా నేడు బీజేపీ ఆందోళనలు…!

తెలంగాణ వ్యాప్తంగా నేడు ఆందోళనలకు దిగనుంది బీజేపీ. అక్రమ అరెస్టులకు నిరసనగా మున్సిపాలిటీ, కార్పొరేషన్, జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిచ్చింది రాష్ట్ర బీజేపీ. నవంబర్‌ ఒకటిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌కు నిరసనగా బీజేపీ కార్యకర్త గంగుల శ్రీనివాస్‌ ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

టీఆర్‌ఎస్‌ నిరంకుశ వైఖరి వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని రాష్ట్ర బీజేపీ ఆరోపిస్తోంది. ఇవాళ శ్రీనివాస్‌ అంతిమయాత్రలో పాల్గొననున్నారు బండి సంజయ్‌. కార్యకర్తలెవరూ ప్రాణ త్యాగాలు చేయొద్దని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు బండి సంజయ్.