BREAKING : రఘునందన్ రావు పై బిజెపి అధిష్టానం వేటు ?

-

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అలాగే కేంద్ర అధ్యక్షుడు జేపీ నడ్డాలపై దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు నిన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పుస్తలముకొని ఎంపీగా పోటీ చేసిన బండి సంజయ్ దగ్గర 100 కోట్లు ఎక్కడివని రఘునందన్ రావు మీడియా సభ్యులతో జరిగిన చిట్ చాట్ లో పేర్కొన్నారు.

అలాగే జేపినడ్డపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆయనపై ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అయితే ఈ విషయంపై తాజాగా రఘునందన్ రావు పై బిజెపి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు తెలంగాణ బిజెపి నేతలు. రఘునందన్ రావు వ్యాఖ్యల కారణంగా బిజెపి నష్టపోయే ప్రమాదం ఉందని అధిష్టానానికి ఆధారాలతో మరి ఫిర్యాదు చేశారు. ఇక రఘునందన్ రావు పై బిజెపి ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version