ఉజ్జ‌యినీ మ‌హంకాళి బోనాలు.. నేడు, రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు..

-

ఆషాడ మాసంలో జరుపుకునే బోనాల జాతర హైదరాబాద్ లో ఉజ్జయిని మ‌హంకాళి బోనాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 25వ తేదీ ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర జరగనుంది. అందువల్ల హైదరాబాద్ లో ట్రాఫిక్ పై పోలీసులు ఆంక్షలు విధించారు. అవి ఎలా ఉన్నాయో చూద్దాం.

ujjaini mahankali bonalu | ఉజ్జయిని మ‌హంకాళి బోనాలు
ujjaini mahankali bonalu | ఉజ్జయిని మ‌హంకాళి బోనాలు

జులై 25వ తేదీ ఉదయం 4గంటల నుండి పూజ ముగిసేవరకు ఆలయానికి వెళ్ళే దారుల్లో అన్ని రాకపోకలను నిషేధించారు. పొగాకు బజార్ హిల్ స్ట్రీట్, జనరల్ బజార్, బాటా క్రాస్ రోడ్, సుభాష్ రోడ్, రామ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను అనుమతి లేదు.

పార్కింగ్ ప్రదేశాలు

  • సెయింట్ జాన్ రోటరీ, స్వీకర్ ఉప్‌కార్‌, ఎస్‌బీహెచ్ నుండి వ‌చ్చే వాహ‌న‌దారులు తమ వాహనాలను హరి హరా క‌ళాభ‌వ‌న్ లేదా మహబూబియా కాలేజీలో పార్కింగ్ చేసుకోవ‌చ్చు.
  • కర్బాలా మైదాన్‌, బైబిల్ హౌస్, ఘన్స్‌మండి నుండి వ‌చ్చే వాహనాలు ఇస్లామియా హైస్కూల్‌లో పార్కింగ్ స‌దుపాయం క‌ల్పించారు.
  • మంజు థియేటర్ నుండి వచ్చే వాహనాలు అంజలి థియేటర్ లేన్ వద్ద పార్క్ చేయాలని, సుభాష్ రోడ్ నుండి వచ్చే వాహనాలు ఓల్డ్ జైలు ఖానాలో నిలిపివేయాలని పేర్కొన్నారు.
  • రాణిగంజ్, అడయ్య ఎక్స్ రోడ్ల నుండి వచ్చే వాహనాలకు అడ‌య్య ఎక్స్ రోడ్ వ‌ద్ద గ‌ల ప్రభుత్వ అడ‌య్య మెమోరియ‌ల్ హై స్కూల్‌లో పార్కింగ్ ప్లేస్ ఇచ్చారు.
  • అలాగే, బైబిల్ హౌస్, ఘన్స్‌మండి, కర్బలా మైదాన్ నుండి వచ్చే వాహనాలు ఇస్లామియా హైస్కూల్‌లో పార్క్ చేయాలి.
  • ఎస్‌బీహెచ్, సెయింట్ మేరీ జాన్ రోడ్ నుండి వచ్చే వాహనాలు హరిహర కళాభవన్ లో పార్కు చేయాలి.

జులై 26 సోమవారం రోజున ఉదయం 10గంటల నుండి మద్యాహ్నాం 2గంటల వరకు సెయింట్ మేరీస్ రోడ్డును మూసివేయనున్నారు.

ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్ళింపు చర్యలు జరగనున్నాయి. అవి ఎలా ఉండనున్నాయంటే,

హకీంపేట, బోయిన‌ప‌ల్లి, బాలానగర్, అమీర్‌పేట నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు వెళ్లే అన్న బస్సులు క్లాక్ టవర్ వద్దే నిలిపివేయబడతాయి.

ప్యాట్నీ క్రాస్ రోడ్స్

ఎంజీ రోడ్, సీటీవో క్రాస్ రోడ్స్ నుండి వచ్చ్చే వాహనాలు ప్యాట్నీ క్రాస్ రోడ్స్ వద్ద నుండి హెచ్ డీఎఫ్సీ, సింధి కాలనీ, మినిస్ట‌ర్ రోడ్ – రాణిగంజ్ క్రాస్ రోడ్స్ – క‌ర్బాలా మైదాన్ వైపుగా వెళ్ళాలి.

ఘన్స్ మండి ఎక్స్ రోడ్

బైబిల్ హౌస్ నుండి వ‌చ్చే ట్రాఫిక్‌ను ఘాస్‌మండి ఎక్స్ రోడ్స్ వ‌ద్ద మ‌ళ్లింపు చేప‌ట్టి స‌జ్జ‌న్‌లాల్ స్ట్రీట్‌, హిల్ స్ట్రీట్ వైపుకు మళ్ళిస్తున్నారు.

రాణీగంజ్

కర్బలా మైదానం నుండి వచ్చే వాహనాలను రాణీగంజ్ వద్ద మళ్ళింపు చేపట్టి, మినిస్ట‌ర్ రోడ్ – ర‌సూల్‌పూరా క్రాస్ రోడ్స్ – సీటీవో – ఎస్‌బీహెచ్ క్రాస్ రోడ్స్ – వైఎంసీఏ క్రాస్ రోడ్స్‌- సెయింట్ జాన్స్ రోట‌రీ – గోపాల‌పురం లేన్ – రైల్వే స్టేష‌న్ వైపుకు పంపనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news