Breaking: ఈరోజు సాయంత్రం 6 గంటలకు సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్

-

ఈరోజు సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ లో సాయంత్రం 6 గంటలకు ఈ మీడియా సమావేశం జరగనుంది. దేశంలో ఈ మీడియా సమావేశంలో ఏ విషయం పై చర్చిస్తారు అనే దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. గత కొద్ది రోజులుగా బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ గా రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే.

 

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

హైదరాబాద్ లో సభ నిర్వహించి సీఎం కేసీఆర్ పై విరుచుకుపడినది బిజెపి. కల్వకుంట్ల కుటుంబ పాలనను విమర్శిస్తూ గల్లీ నుంచి ఢిల్లీ నాయకుల వరకు అందరూ మాట్లాడారు. అయితే ఈ సభ జరిగిన సరిగ్గా వారం రోజులకు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే గత మూడు రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ పలు సూచనలు చేసే అవకాశం ఉంది. వర్షాకాలం సమీపించిన సందర్భంగా రైతులకు శుభవార్త చెప్పే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news