Breaking: మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి హైడ్రా నోటీసులు

-

ప్రస్తుతం తెలంగాణలో ఏ నోట విన్నా హైడ్రా మాటనే వినిపిస్తోంది. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో ఒక్కసారిగా హైడ్రా నిర్ణయాలపై ఉత్కంఠ పెరిగింది. ఇప్పటివరకు హైడ్రా పలువురు ప్రముఖుల అక్రమణాలను కూల్చివేసింది. మొదట మాజీ కేంద్రమంత్రి పళ్ళం రాజుతో మొదలుపెట్టిన హైడ్రా ఇప్పటివరకు ప్రభుత్వానికి చెందిన 43 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది.

అయితే ఇప్పుడు హైడ్రా మాదాపూర్ దుర్గం చెరువు ఏరియాపై ఫోకస్ పెట్టింది. ఈ దుర్గం చెరువును ఆనుకొని కట్టిన కావూరి హిల్స్, సెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఇలా నోటీసులు అందుకున్న వారిలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి కూడా ఉన్నారు. ఇప్పటివరకు మొత్తం 204 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. నెల రోజులలోపు ఈ నిర్మాణాలు తొలగించకపోతే తామే చర్యలు తీసుకుంటామని నోటీసులలో వివరించారు.

అయితే ఈ నోటీసులు అందుకున్న వారిలో చాలామంది ఐఏఎస్ అధికారులతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇప్పటికే ఓ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీ భవనాలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వగా.. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి కూడా నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version