బ్రేకింగ్: హైదరాబాద్ కు ఆరెస్సెస్ చీఫ్

హైదరాబాద్ కు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ రానున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో 10.20 నుండి 4.20 వరకు ఉండనున్నారు మోహన్ భాగవత్. నాగపూర్ నుండి కోలకత్తా వెళ్తూ.. ఆరు గంటల పాటు శంషాబాద్ లో గడపనున్న ఆరెస్సెస్ చీఫ్… పలువురు తెలుగు ప్రముఖులతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మోహన్ భాగవత్ ను కలవనున్నారు తెలుగు రాష్ట్రాల అరెస్సెస్ ముఖ్య నేతలు.

తెలుగు రాష్ట్రల్లో జరుగుతోన్న తాజా పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా వెళ్లి కలిసే అవకాశం ఉంది. ఆయనతో పాటు తెలంగాణా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కూడా భేటీ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అంతే కాకుండా మరి కొందరు అగ్ర నేతలు ఆయనతో పాటు వెళ్ళే అవకాశం ఉంది అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.