మనీష్ సిసోడియా అరెస్టును ఖండించిన BRS

-

మనీష్ సిసోడియా అరెస్టును ఖండించారు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు. మనీష్ సిసోడియా అరెస్టు ప్రజాస్వామికం… బిజెపి పార్టీ ప్రతిపక్షాల పైన వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గపూరితమని… కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఏజెన్సీలను ప్రతిపక్షాలపై ఉసిగొలిపి దొంగచాటు రాజకీయాలను బిజెపి చేస్తుందని ఫైర్‌ అయ్యారు.

ప్రజాబలం లేక అధికారంలోకి రాలేని ప్రాంతాల్లో రాష్ట్రాల్లో అక్కడి పార్టీలను కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించుకొని బలహీనపరిచే కుట్రలో భాగమే సిసోడియా అరెస్ట్ అని… బిజెపి ప్రతిపక్షాలపై చేస్తున్న రాజకీయ కుట్రలు దేశంలో ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారాయని చెప్పారు.

బిజెపి కక్ష సాధింపు రాజకీయాల కు మనీష్ సిసోడియాను అరెస్ట్ పారాకాష్ట అని… ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ద్వారా చివాట్లు తిన్న తర్వాత ఎదురైన పరాజయాన్ని తట్టుకోలేక సిసోడియాను ఇప్పుడు అరెస్ట్ చేశారని నిప్పులు చెరిగారు. బిజెపి అసమర్థ విధానాలను అవినీతిని ప్రశ్నిస్తున్న బలమైన పార్టీలను నాయకులను ఎదుర్కోలేక పిరికి రాజకీయాలు చేస్తుందని.. బిజెపి తన పార్టీలోని అవినీతి నాయకులను సత్యహరిశ్చంద్రుని సహోదరులుగా చూపించి, ప్రతిపక్షాల నాయకులను అవినీతిపరులుగా చిత్రీకరించి కుటిల ప్రయత్నాలను చేస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news