చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాదసభ మందమర్రిలో జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రజా స్వామ్య దేశంలో ప్రజల దగ్గర ఏకైక వజ్రాయుధం మీ ఓటు.. మాకు డబ్బులు ఇచ్చాడని.. వాళ్లు.. వీళ్లు చెప్పారని ఓటు వేయకూడదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ముసుగు మార్చుకొని పార్టీ మారారు. మీ ఓటు ఐదేళ్ల భవిష్యత్ ని నిర్ణయిస్తుంది. బీఆర్ఎస్ చరిత్ర మీ కళ్ల ముందే ఉంది. పుట్టిందే తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం.. ప్రజలు ఆశీర్వదిస్తే.. తెలంగాణను చక్కదిద్దుతాం. బీఆర్ఎస్ కి ఢిల్లీ బాసులు లేరు.. బీఆర్ఎస్ కి తెలంగాణ ప్రజలే బాసులు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణను ముంచింది కాంగ్రెస్ పార్టీనే. చైతన్యం మనలో వస్తేనే బాగుపడి ముందుకు వెళ్తాం బీఆర్ఎస్ 24 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ అని తెలిపారు. ఇక్కడి కాంగ్రెస్ నేతలకు టికెట్ ఇచ్చే పవర్ కూడా ఉండదు. కాంగ్రెస్ ఏం చేసిందో.. బీఆర్ఎస్ ఏం చేసిందో మీకు తెలుసు అన్నారు. ఏ ప్రభుత్వం ఉంటే మన భవిష్యత్ బాగుపడుతుందనేది ఆలోచించాలి.