బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీ సర్కారుకు లొంగిపోయింది : సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణలో నీటి పంపకాలు, నీటి సమస్యల  గురించి తెలంగాణ ముఖ్యమంత్రి తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తమ తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కేటీఆర్, హరీశ్ రావు మాపై ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రి చైర్మన్ గా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు మెంబర్స్ గా ఉండి నిర్ణయాలు తీసుకోవాలి.

పునర్విభజన చట్టం 84 నుంచి 89 వరకు ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణలపై స్పష్టంగా ఉందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీ సర్కారుకు లొంగిపోయింది. విభజన చట్టంలోని ప్రతీ అక్షరం నన్ను అడిగే రాశారని కేటీఆర్ గతంలో చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను గందరగోళానికి గురి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్  811 టీఎంసీలు కేటాయించింది అని గుర్తు చేశారు. చట్టం రూపొందించినప్పుడు కేసీఆర్ లోక్ సభలో, కేకే రాజ్యసభలో ఉన్నారు. ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఇచ్చేటట్టు సంతకం పెట్టిన దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. 

 

Read more RELATED
Recommended to you

Latest news