మేడిగడ్డ బ్యారేజ్ పై బీఆర్ఎస్ ఆసక్తికర ట్వీట్..!

-

మేడిగడ్డ బరాజ్ సేఫ్ అని, నిపుణులు తేల్చి చెప్పారని బీఆర్ఎస్ పేర్కొంది. ఈమేరకు ఇవాళ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ప కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం అంతా ఉత్తదేనని నిపుణుల బృందం తేల్చేసిందని తెలిపింది. మేడిగడ్డ బరాజ్ లోని ఒక్క ఏడవ బ్లాక్ లో చిన్న మరమ్మత్తులు చేసి, బరాజ్న యధావిధిగా వాడొచ్చు అని స్పష్టం చేసిందని వెల్లడించింది.

కేసీఆర్ మీద కక్షతో కాళేశ్వరంపై అనవసర రాద్దాంతం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర నాయకుల చెంప చెల్లుమనిపించేలా నిపుణుల బృందం రిపోర్ట్ ఇచ్చిందని విమర్శించింది. కేవలం వారి అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ మీద, గత ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ బురద చల్లుతున్నదని, తెలంగాణ శాశ్వత ప్రయోజనాల కోసం నిర్మించిన వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్పై ఇకనైనా దుష్ప్రచారం ఆపకుంటే.. ప్రజలు వాళ్ళకి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news