గ్రూప్ 1 పై మా పార్టీ తరపున సుప్రీంకోర్టులో పిటీషన్ వేశాము. సుప్రీంకోర్టు మా పిటిషన్ ను తిరస్కరించలేదు. జీవో 29 ద్వారా నష్టం జరుగుతుందని మేము ముందే చెప్పాము అని KTR అన్నారు. ప్రశాంతంగా జరగాల్సిన గ్రూప్ 1 పరీక్షలు గందరగోళంలో జరుగుతున్నాయి. 95 శాతం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని కేసీఆర్ జీఓ తీసుకువచ్చారు. మేము తెచ్చిన జీవో 55 బలహీన వర్గాలకు అనుకూలంగా ఉంది. జీవో 29పై హైకోర్టులో ఇంప్లీడ్ అవుతాము.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చింది నిరుద్యోగులు. నిరుద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వెళ్లి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై రైడ్ జరిగితే ఇప్పటి వరకు ఈడీ నోట్ ఇవ్వలేదు. బిఆర్ఎస్ వున్నప్పుడు రాష్ట్రంలో ఒక్క సంఘటన జరగలేదు. కాంగ్రెస్ వచ్చాక ఘటనలు జరుగుతున్నాయి. ముత్యాలమ్మ గుడిపై దాడి జరిగితే నేను ట్వీట్ చేస్తే ప్రభుత్వం నాకు శాంతి భద్రతల కిందకు వస్తుందని నోటీసు పంపింది. రేవంత్ రెడ్డికి సిగ్గుంటే నువ్వు రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు రావాలి అని KTR పేర్కొన్నారు.